అన్నదానం, సేవా కార్యక్రమాలు, సిబ్బందికి ప్రత్యేక సన్మానాలు – దాత మట్లి సురేందర్ రెడ్డి సేవలను కొనియాడిన నాయకులు
ఆత్మకూరు, జూలై 10 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు మరియు ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నేత మాజీ అట్రాసిటీ కమిటీ మెంబర్ ఆత్మకూరు పట్టణంలోని ఏ ఎస్ ఆర్ కాలేజ్ కరెస్పాండెంట్ మట్లి సురేంద్ర రెడ్డి సేవా భావంతో మంత్రి ఆనం జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.. బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక సీఐ గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో ప్రసంగించారు.. ఈ సందర్భంగా 75 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు కేకులు తినిపించుకొని మంత్రి ఆనంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మట్లీ సురేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బందికి కలిపి మొత్తం 350 మందికి నూతన వస్త్రాలను అందించారు.. అలాగే కార్యక్రమం వద్ద 1000 మందికి ఉచిత అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్భంగా టిడిపి నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూరు అభివృద్ధి అంటే ఆనం అని టిడిపి నేతలు కొనియాడారు. మట్లి. సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే మన నేత ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఆత్మకూరు కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అందుకోసమే తన సొంత ఖర్చులతోనే ఈ పూర్తి సేవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలు, అన్ని మండలాల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.



