ఆత్మకూరు సెప్టెంబర్ 15 ( పున్నమి ప్రతినిధి )
ఆత్మకూరు మండలంలో 2026 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు ఎంపీడీవో రఫీ ఖాన్ తెలిపారు. మండలంలోని 9 ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముసాయిదా జాబితాను మండల ప్రజాపరిషత్ కార్యాలయం, ఎంఆర్వో కార్యాలయంతో పాటు 21 గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉన్న వారు ఈ నెల 16వ తేదీలోపు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రాతపూర్వకంగా సమర్పించాలని ఎంపీడీవో సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.


