ఆత్మకూరు. సెప్టెంబర్ 15 పున్నమి. ప్రతినిధి
సాగునీరు అందక రైతుల ఆందోళన.. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి
ఆత్మకూరు: మండలంలోని శాంతినగరంలో సాగునీరు అందక సుమారు 80 ఎకరాల వరి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొగేరు స్కీం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం నీటిని తరలించాల్సి ఉండగా, కాలువలను శుభ్రం చేయడంతో పాటు మోటార్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు రూ.1.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసినప్పటికీ నీరు అందక పంట ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ఏపీ రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.


