పున్నమి ప్రతినిధి,తిరుమల జూలై 25
తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 01 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.ఈ ఏడాది సెప్టెంబరు 15 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితు లను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 01 నుండి 10 వ తేది వరకు పుష్కరిణి మూసివేయ బడుతుంది.కావున ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


