Sunday, 26 July 2026
  • Home  
  • ముకుందవరంలో పండ్ల మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- ఆంధ్రప్రదేశ్

ముకుందవరంలో పండ్ల మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమిల్లి

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవీక మిషన్‌ ద్వారా మొక్కల పెంపకానికి ప్రోత్సాహం రంగంపేట, జూలై 25 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవీక మిషన్ (గ్రామీణ్) పథకం ద్వారా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పండ్ల మొక్కలను నాటారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పండ్ల మొక్కల పెంపకం ద్వారా ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే నల్లమిల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రంగంపేట మండల కూటమి నాయకులు, ముకుందవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవీక మిషన్‌ ద్వారా మొక్కల పెంపకానికి ప్రోత్సాహం

రంగంపేట, జూలై 25 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవీక మిషన్ (గ్రామీణ్) పథకం ద్వారా పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పండ్ల మొక్కలను నాటారు.

గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పండ్ల మొక్కల పెంపకం ద్వారా ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే నల్లమిల్లి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రంగంపేట మండల కూటమి నాయకులు, ముకుందవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.