డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మామిడికుదురు గ్రామానికి చెందిన రైతు నయనాల రామకృష్ణ దేశవాళీ ఆవు మూడో ఈతలో గురువారం అరుదైన పుంగనూరు పెయ్యి దూడకు జన్మనిచ్చింది.
కేవలం 18 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ఈ చిట్టి పుంగనూరు దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముద్దులొలికే ఈ దూడను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం ఈ జాతి దూడకు మార్కెట్‌లో సుమారు రూ.2.50 లక్షల వరకు విలువ ఉంటుందని రైతు రామకృష్ణ తెలిపారు.
తమ ఇంటికి మహాలక్ష్మి అడుగుపెట్టినట్లుగా ఉందంటూ రైతు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

