జలదంకి మండలం లోని ZPHS స్కూల్ లో SIR ఓటర్ వెరిఫికేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జలదంకి జనసేన పార్టీ మండలం అధ్యక్షులు మురళి ఆయనతో పాటు ఉదయగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు రామ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎంతో విలువైందని, అర్హులైన ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు మరియు వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని జనసేన పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో అందరూ రాబోయే 3 రోజులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏ బూతులోనైనా ఎటువంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని ఆయన తెలియజేశారు.




