*అమరావతి ఉద్యమ యోధుడు దనేకుల రామారావుకు దేవినేని ఉమ ఘన నివాళి*
*రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి*
తుళ్లూరు, నేలపాడు (సెప్టెంబర్ 19):
*తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అమరావతి జేఏసీ సభ్యులు దనేకుల రామారావు కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. అమరావతి ఉద్యమ సమయంలో 40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రామారావు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులోని ఆయన స్వగృహానికి వెళ్లిన దేవినేని ఉమా, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.*




