Sunday, 9 August 2026
  • Home  
  • *అనపగుంటలో జనం బాట పట్టిన కాంగ్రెస్*
- తిరుపతి

*అనపగుంటలో జనం బాట పట్టిన కాంగ్రెస్*

*అనపగుంటలో జనం బాట పట్టిన కాంగ్రెస్* *గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ దెయ్యాల కిరణ్* *తాగునీరు, పారిశుద్ధ్యం, ఇంటి నిర్మాణాలపై ప్రజల ఆవేదన* *అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ* *గరుడ దాత్రి తడ ఆగస్టు 9: (పున్నమి న్యూస్ ప్రతినిధి మద్దాలి వెంకయ్య) మండలంలోని అనపగుంట గ్రామంలో నెలకొన్న తీవ్ర ప్రజా సమస్యలను పారద్రోలేందుకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దెయ్యాల కిరణ్ ఆదివారం అనపగుంట గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని గడప గడపకూ తిరుగుతూ ప్రజలతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి వారి అవస్థలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యలైన స్వచ్ఛమైన తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల లేమి మరియు ఏళ్లుగా పెండింగ్‌లో పడిపోయిన ఇళ్ల నిర్మాణాల వ్యవహారంపై స్థానిక ప్రజలతో కలిసి ఆయన సమగ్రంగా చర్చించారు. పారిశుధ్య లోపం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అరకొర వసతులతో నరకం చూస్తున్నామని గ్రామస్తులు ఆయన వద్ద వాపోయారు. *అధికారులను నిలదీసి సమస్యలు పరిష్కరిస్తాం* అనంతరం దెయ్యాల కిరణ్ మాట్లాడుతూ… అనపగుంట గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందని విమర్శించారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో పడిపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటినీ సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, తక్షణమే పరిష్కారమయ్యేలా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కృషి చేస్తామని అనపగుంట గ్రామ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. *అట్టహాసంగా సాగిన పర్యటన* ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తడ మండల ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆవల రమణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు జోగి వినోద్, మహిళా అధ్యక్షురాలు శ్వేత, తిరుపతి జిల్లా అడ్వకేట్ విభాగం నాయకులు మధుకర్ బాబు, తడ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పూజారి లోకేష్, తడ మండల నాయకులు బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*అనపగుంటలో జనం బాట పట్టిన కాంగ్రెస్*

*గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ దెయ్యాల కిరణ్*

*తాగునీరు, పారిశుద్ధ్యం, ఇంటి నిర్మాణాలపై ప్రజల ఆవేదన*

*అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ*

*గరుడ దాత్రి తడ ఆగస్టు 9: (పున్నమి న్యూస్ ప్రతినిధి మద్దాలి వెంకయ్య)

మండలంలోని అనపగుంట గ్రామంలో నెలకొన్న తీవ్ర ప్రజా సమస్యలను పారద్రోలేందుకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దెయ్యాల కిరణ్ ఆదివారం అనపగుంట గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని గడప గడపకూ తిరుగుతూ ప్రజలతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి వారి అవస్థలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యలైన స్వచ్ఛమైన తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల లేమి మరియు ఏళ్లుగా పెండింగ్‌లో పడిపోయిన ఇళ్ల నిర్మాణాల వ్యవహారంపై స్థానిక ప్రజలతో కలిసి ఆయన సమగ్రంగా చర్చించారు. పారిశుధ్య లోపం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అరకొర వసతులతో నరకం చూస్తున్నామని గ్రామస్తులు ఆయన వద్ద వాపోయారు.

*అధికారులను నిలదీసి సమస్యలు పరిష్కరిస్తాం*

అనంతరం దెయ్యాల కిరణ్ మాట్లాడుతూ… అనపగుంట గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందని విమర్శించారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో పడిపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటినీ సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, తక్షణమే పరిష్కారమయ్యేలా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కృషి చేస్తామని అనపగుంట గ్రామ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

*అట్టహాసంగా సాగిన పర్యటన*
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తడ మండల ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆవల రమణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు జోగి వినోద్, మహిళా అధ్యక్షురాలు శ్వేత, తిరుపతి జిల్లా అడ్వకేట్ విభాగం నాయకులు మధుకర్ బాబు, తడ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పూజారి లోకేష్, తడ మండల నాయకులు బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.