Thursday, 18 June 2026
  • Home  
  • అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం-చెట్టు కూలి చిన్నారులకు తీవ్ర గాయాలు
- తిరుపతి

అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం-చెట్టు కూలి చిన్నారులకు తీవ్ర గాయాలు

శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని 32వ వార్డు దర్గామిట్ట వద్ద బుధవారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా వీచిన సాధారణ గాలికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. గాయపడిన చిన్నారులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుల పిల్లలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.