Wednesday, 24 June 2026
  • Home  
  • అక్కంపేటలో అగ్నిప్రమాదం.. 10 ఎకరాల గడ్డివాము దగ్ధం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో అగ్నిప్రమాదం.. 10 ఎకరాల గడ్డివాము దగ్ధం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రైతు సుబ్రహ్మణ్యంకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలోని గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 600 గడ్డి మోపులు కాలిపోగా, దాదాపు రూ.60 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రైతు సుబ్రహ్మణ్యంకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలోని గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 600 గడ్డి మోపులు కాలిపోగా, దాదాపు రూ.60 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.