పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
బోగోలు మండలంలోని తాళ్లూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు నేలకొరిగిన వరి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. కోతకు వచ్చిన పైరు నేలకు వాలిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరి పంట కోతకు వచ్చిన సమయంలో పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా నీటిని పూర్తిగా బయటకు పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు. పంట నీటిలో ఎక్కువ రోజులు మునిగి ఉంటే గింజలు మొలకెత్తే అవకాశం ఉందని తెలిపారు. నివారించేందుకు 5 శాతం ఉప్పు ద్రావణంను పిచికారిచేయాలని సూచించారు.
పంట నష్టం తీవ్రంగా ఉంటే ప్రభుత్వానికి నివేదికల పంపి సహాయం అందిటట్లు చేస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు.


