Wednesday, 22 April 2026
  • Home  
  • అకస్మాత్తు ప్రమాదంలో మృతిచెందిన మహిళ కుటుంబానికి ముదిరాజ్ సంఘం చేయూత
- రాజన్న సిరిసిల్ల

అకస్మాత్తు ప్రమాదంలో మృతిచెందిన మహిళ కుటుంబానికి ముదిరాజ్ సంఘం చేయూత

ముస్తాబాద్, ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామానికి చెందిన రాళ్లపాట లక్ష్మీ గారు దుబ్బాక ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని కలిగించింది. మృతురాలి కుటుంబం చాలా పేదరికంలో ఉండి, ఇల్లు మరియు భూమి లేని కటిక పేదరికంలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి చెందిన మహిళ మృతి చెందిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం స్పందించింది. మృతురాలి కూతురు పోతిరెడ్డి పద్మ, అల్లుడు పోతిరెడ్డి దేవయ్య గారిని పరామర్శించి, వారి తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంఘం అధ్యక్షుడు పిట్ల విట్టల్ గారి ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జాల బిక్షపతి, గీస బిక్షపతి (సి.డబ్ల్యూ.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు), పిట్ల రాజు (అవునూరి గ్రామ అధ్యక్షుడు), బోయిన్ గంగాధర్, దేవరాజు గోపాల్, వెంకట్, శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, వెంకటేష్, బోయిన్ బిక్షపతి, గోపన్న గారి వెంకట్, జక్కుల గిరి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో ఈ ఆర్థిక సహాయంను అందజేయడం జరిగింది.

ముస్తాబాద్, ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామానికి చెందిన రాళ్లపాట లక్ష్మీ గారు దుబ్బాక ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని కలిగించింది.
మృతురాలి కుటుంబం చాలా పేదరికంలో ఉండి, ఇల్లు మరియు భూమి లేని కటిక పేదరికంలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి చెందిన మహిళ మృతి చెందిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం స్పందించింది. మృతురాలి కూతురు పోతిరెడ్డి పద్మ, అల్లుడు పోతిరెడ్డి దేవయ్య గారిని పరామర్శించి, వారి తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంఘం అధ్యక్షుడు పిట్ల విట్టల్ గారి ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో జాల బిక్షపతి, గీస బిక్షపతి (సి.డబ్ల్యూ.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు), పిట్ల రాజు (అవునూరి గ్రామ అధ్యక్షుడు), బోయిన్ గంగాధర్, దేవరాజు గోపాల్, వెంకట్, శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, వెంకటేష్, బోయిన్ బిక్షపతి, గోపన్న గారి వెంకట్, జక్కుల గిరి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో ఈ ఆర్థిక సహాయంను అందజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.