Wednesday, 16 September 2026
  • Home  
  • అంగన్వాడి బాలల భవిష్యత్ పునాది చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు పోషణ ప్రత్యేక దృష్టి
- ఎన్ టి ఆర్ జిల్లా

అంగన్వాడి బాలల భవిష్యత్ పునాది చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు పోషణ ప్రత్యేక దృష్టి

అంగన్వాడీలే బాలల భవితకు పునాది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణపై ప్రత్యేక దృష్టి.. నిర్లక్ష్యానికి తావులేదు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. దుగ్గిరాలపాడులో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 15/09/2026. బాలల భవితకు పునాది అంగన్వాడీలేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు మరింత సమర్థంగా, నాణ్యతతో ప్రజలకు చేరేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా, నాణ్యతతో అందేలా చూడాలని అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వారికి అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సూచనలు, వైద్య సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని, కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, బరువు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సందర్భాల్లో వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. దుగ్గిరాలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా చిన్నారులు, మహిళలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీలే బాలల భవితకు పునాది.

చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణపై ప్రత్యేక దృష్టి.. నిర్లక్ష్యానికి తావులేదు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

దుగ్గిరాలపాడులో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం.

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 15/09/2026.

బాలల భవితకు పునాది అంగన్వాడీలేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు మరింత సమర్థంగా, నాణ్యతతో ప్రజలకు చేరేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా, నాణ్యతతో అందేలా చూడాలని అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వారికి అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సూచనలు, వైద్య సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని, కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, బరువు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సందర్భాల్లో వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

దుగ్గిరాలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా చిన్నారులు, మహిళలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.