ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపురం మండలం , కొత్తూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం 50 వసంతాల కార్యక్రమాన్ని జై భీమ్ యువజన పొదుపు సంఘం కొత్తూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతం చేయడం జరిగింది జై భీమ్ యువజన పొదుపు సంఘం అధ్యక్షులు భానోత్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జై భీమ్ యువజన పొదుపు సంఘం గౌరవాధ్యక్షులు న్యాయవాది కందికట్ల వీరేష్ నీలిరంగు జెండాను ఆవిష్కరించడం జరిగింది . అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ ఆలోచన విధానం వెనుకబడిన తరగతుల్లో బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో దళితవాడలో నేడు వెలుగు బాటలుగా మారాయన్నారు ఎంతోమందిని ప్రభుత్వ ఉద్యోగులను మన హక్కులు మన రిజర్వేషన్ల కోసం దళితులపైన జరుగుతున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడంలో అంబేద్కర్ కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ యువజన పొదుపు సంఘం కోశాధికారి జేరిపోతుల అజయ్ మూడవ వార్డు మెంబర్, మాజీ అధ్యక్షులు కందికట్ల వినోద్ కుమార్ మాజీ ఉపాధ్యక్షుడు మేడిపల్లి శంకర్ తో పాటుగా నాంపల్లి రాజు, లడ్డు, బుద్ధ ప్రభాకర్, బుద్ధదేవేందర్, బూస కుమార్ స్వామి, వల్లే పైడి తదితరులు పాల్గొన్నారు.



