జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నంద్యాల : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు రాచమడుగు చందు, సుందర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందేమాతరం, జనగణమన ఆలపించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, యువత వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వీరమహిళా సంఘం జయంతి, రాచమడుగు రాంబాబు, సంజీవరాయుడు, వెంకట సుబ్బయ్య, రామలింగేశ్వర వరప్రసాద్, సయ్యద్ ఫరూక్, విష్ణు, చిన్న, శ్రీనివాసులు, హేమంత్, ముకేష్ రెడ్డి, రాజు, యూనుస్ తదితరులు పాల్గొన్నారు.


