Thursday, 24 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు..!

చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు అనకాపల్లి, సెప్టెంబర్ 17: ​పున్నమి ప్రతినిధి ఆనంద్ శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్ర సాంకేతికతకు ప్రతీక అయిన దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… శ్రీ విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా, నిర్మాణ శాస్త్రానికి (ఆర్కిటెక్చర్) ఆద్యుడిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయని గుర్తుచేశారు. ద్వారక వంటి అద్భుత నగరాల నిర్మాణంతో పాటు దేవతల ఆయుధాలు, రథాలను తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.​శ్రమజీవులందరికీ విశ్వకర్మ స్ఫూర్తిప్రదాత: కేవలం దేవతల శిల్పి మాత్రమే కాక, కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు, శిల్పి, వడ్రంగి, ఇంజనీర్, పారిశ్రామికవేత్త వెనుక ఉన్న నిజమైన ప్రేరణ శ్రీ విశ్వకర్మ.ఆధునిక సాంకేతికతకు మార్గదర్శకం: నేటి ఆధునిక యుగంలోనూ ఆయన ప్రదర్శించిన సృజనాత్మకత, నైపుణ్యం ఎంతో ఆచరణీయం.నైపుణ్యమే విజయం: కష్టపడే తత్వం, అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన పనులనైనా అద్భుతంగా సాధించవచ్చనే సందేశాన్ని విశ్వకర్మ జీవితం నేర్పుతుంది. ​కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు, డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, అప్పలనాయుడు, శ్రీనివాసరావు, రామకృష్ణారావు, మన్మధరావు, ఏ.వో సి.హెచ్.తిలక్ బాబు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అనకాపల్లి

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం

పున్నమి ప్రతినిధి ఆనంద్ : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆర్థిక ప్రయోజనాలు, కారుణ్య నియామకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం అనకాపల్లి, సెప్టెంబర్ 17: విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఎస్పీ గారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఆయన ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి రావలసిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఫ్యామిలీ పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంకేతిక, రికార్డుపరమైన సమస్యలను వెంటనే సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ​ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… “విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు మరువలేనివి. వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రథమ ప్రాధాన్యత. మీరంతా మా పోలీస్ కుటుంబ సభ్యులే. మీకు ఏ విధమైన సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా నన్ను కలవవచ్చు. శాఖాపరంగా అన్ని విధాలా మీకు అండగా ఉంటాం,” అని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యరావు, రామకృష్ణారావు, మన్మధరావు, కార్యాలయ పరిపాలనాధికారి (ఏవో) శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, ఎస్సై హరినాథ్ మరియు ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

అనకాపల్లి

అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అనకాపల్లి పట్టణం, సెప్టెంబర్ 17:పున్నమి ప్రతినిధి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించిన ఎస్పీ, పెండింగ్ కేసుల పురోగతి మరియు స్టేషన్ నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్షించారు.​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు రౌడీ షీటర్లపై కఠిన నిఘా: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.పగలు, రాత్రి గస్తీ (బీట్ సిస్టమ్): రద్దీ ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.సీసీటీవీ కెమెరాల నిఘా: పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో నిఘా నేత్రాలను మరింత బలోపేతం చేయాలని, వ్యాపార సంస్థలు మరియు కాలనీల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.​ మహిళా భద్రత & శక్తి యాప్: మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉండేలా చూడాలని పేర్కొన్నారు.​ సైబర్ నేరాలపై చైతన్యం: రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ ఫిర్యాదులు రాగానే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం: స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్, ఎస్సైలు షేక్ జిలాని, వెంకటేశ్వరరావు, భాస్కరరావు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

మోదీ జన్మదినం వేళ భక్తి వెలుగులు.. ఏటికొప్పాకలో ఆశీర్వాద దీపాల కార్యక్రమం

యలమంచిలి, పున్నమి ప్రతినిధి ఆనంద్: ఏటికొప్పాక గ్రామంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా సంకల్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు చేపట్టారు. వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీ శిరిడీ సాయిబాబా మందిరంలో భక్తులు విశేష పూజలు నిర్వహించి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భజన బృందాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణాలు భక్తిశ్రద్ధలతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు, పెద్దలు పాల్గొని ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనకాపల్లి

గుంతలమయంగా సైతార్‌పేట రోడ్డు..!

పున్నమి ప్రతినిధి ఆనంద్ : ఎలమంచిలి మున్సిపాలిటీ నుంచి ఎస్.రాయవరం వైపు వెళ్లే సైతార్‌పేట ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాల భయం నెలకొంది. వాహనాల టైర్లు, వీల్స్, సస్పెన్షన్ దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా 15 రోజుల్లోనే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రహదారికి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

అనకాపల్లి

యలమంచిలిలో కాంగ్రెస్ సమర శంఖం..!!

యలమంచిలి, సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి ఆనంద్ ): యలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డి రవి, నియోజకవర్గ ఇన్‌చార్జి తనకాల అనంతరావు, రావి, ఎం.వి. రాహుల్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై కీలక చర్చలు జరిగాయి. చైర్మన్ అభ్యర్థిగా దొడ్డి రవిని ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు. సమీకరణాల అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది. 32 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించారు. పలువురు కొత్త కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు సమర శంఖం పూరించారు.

అనకాపల్లి

హిందీపై మక్కువ పెంచుకోవాలి.. భాషా ప్రావీణ్యంతో భవిష్యత్తుకు బాటలు

ఎలమంచిలి, సెప్టెంబర్ 17 – పున్నమి ప్రతినిధి ఆనంద్: ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ భాషోత్సవాల్లో భాగంగా గురువారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎస్.వి.ఎన్.ఎస్. వరలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు హిందీ భాషలో బాలగీతాలు, గీతాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎన్.ఎన్.ఎల్.డి. భవాని మాట్లాడుతూ విద్యార్థులందరూ దేశంలో విస్తృతంగా ఉపయోగించే హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లిపాటి సత్యనారాయణ, డి.వి. భారతి, కే. రాజేష్, జి.ఎస్. కామేశ్వరి, టీ. ఇందిరారాణి, బి. నరేంద్ర, వై. భాస్కరరావుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

అనకాపల్లి

జంపాపాలెంలో ఘనంగా ఓజోన్ డే వేడుకలు..

పున్నమి ప్రతినిధి :ఆనంద్ యలమంచిలి : మండలంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ జంపాపాలెం పాఠశాలలో ఓజోన్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వై.ఎన్. రాజు, ఆది ఎన్. రాజు, సంపత్, సుజాత, కెర్లిన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓజోన్ పొర భూమిపై జీవరాశిని సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణహిత చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ, ఓజోన్ పొర సంరక్షణపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.

అనకాపల్లి

​యలమంచిలి టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం ..

పున్నమి ప్రతినిధి : ​యలమంచిలి : పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ) అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల సేవలను గుర్తించి, వారికే కౌన్సిలర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడినే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టణ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివన్నారాయణ మూర్తి మాట్లాడుతూ… “అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పారిశ్రామిక పురోగతి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రెటరీ ఆడారి ఆదిమూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ బోద్ధపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్లి బాబురావు, టౌన్ ఉపాధ్యక్షులు దంట్ల వెంకటస్వామి, బీసెట్ చిన్నారావు, పిల్ల గంగాధర్, తుంపాల గంగాధర్, భీముని సత్యనారాయణ, బి. అశోక్ కుమార్, నాగేంద్ర తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

శాంతియుతంగా వినాయక నవరాత్రులు వేడుకలు జరుపుకోవాలి..

– రూరల్ ఎస్ఐ ఉపేంద్ర ​యలమంచిలి : వినాయక చవితి ఉత్సవాల వేళ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని రూరల్ ఎస్ఐ ఉపేంద్ర కోరారు. బుధవారం యలమంచిలి మండలంలోని పి.ఎన్.ఆర్ పేట గ్రామాన్ని సందర్శించిన ఆయన, పండుగ నిర్వహణపై గ్రామస్తులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్ర మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సమయంలో ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, గొడవలకు తావివ్వకుండా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని, మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ​ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.