Tuesday, 15 September 2026

Tag: అంబేద్కర్ సంఘాల హెచ్చరిక

రాజన్న సిరిసిల్ల

బహుజనుల దిక్సూచి అంబేద్కర్: చరిత్రను వక్రీకరించడం అంటే రాజ్యాంగ విలువలను అవమానించడమే”

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 15 ( పున్నమి ప్రతినిధి) అంబేద్కర్‌పై అసత్య ప్రచారం చేస్తే సహించం అంబేద్కర్ సంఘాల నాయకుల హెచ్చరిక ముస్తాబాద్, సెప్టెంబర్ 15: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్రపై ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘాల నాయకులు స్పందించారు. అంబేద్కర్ చరిత్రను వక్రీకరించి, అసత్యాలను ప్రచారం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ బహుజనుల కలలను సాకారం చేసిన మహానాయకుడని, ఆయనను కించపరిచేలా ఎలాంటి రచనలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి ప్రచారం వెనుక మనువాద భావజాలం ఉన్న శక్తులు ఉండవచ్చని ఆరోపించారు. అంబేద్కర్‌ను కించపరచడం అంటే రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే బహుజన వర్గాలు విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ చరిత్రను వక్రీకరించకుండా అడ్డుకోవడానికి బహుజనులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై మేధావులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో కొమ్మెట రాజు, చుంచు మల్లేష్, సడిమెల ఎల్లం, కొల్లూరి నాగరాజు, పర్శరాములు తదితరులు పాల్గొన్నారూ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.