అసెంబ్లీ బయట అరెస్టులపై తలసాని ఫైర్
అసెంబ్లీ సమావేశాలకు రమ్మని చెప్పి బయటే బీఆర్ఎస్ సభ్యులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు నల్ల టీషర్టులతో వచ్చిన సభ్యులను అసెంబ్లీలోకి వెళ్లకముందే అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్‌తో వెళ్లవచ్చని, తమ సభ్యులు మాత్రం ధరించకూడదా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.


