చిన్నారిని కరిచిన వీధి కుక్క.. తీవ్ర గాయాలు
కావలి రూరల్: సిరిపురం గ్రామంలో వీధి కుక్క దాడిలో మూడో తరగతి చదువుతున్న దేవాన్షి అనే చిన్నారి గాయపడ్డాడు. ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్క చిన్నారిపై దాడి చేసి కరవడంతో గాయాలయ్యాయి. ఘటనను గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. గ్రామంలో వీధి కుక్కల సంచారం పెరుగుతుండటంతో పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని వారు కోరుతున్నారు. కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

