Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Serilingampally

మేడ్చల్ – మల్కాజిగిరి

బల్మూరి వెంకట్ .. మాటలు తగ్గించి చేతల్లో చూపించండి.

“ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ …మీ మాటలకు, చేతలకు పొంతన లేదనే విషయం ప్రజలకు, విద్యార్థులకు కూడా తెలుసు. రెండేళ్లుగా అధికారంలో ఉండి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి. అనవసర విమర్శలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న స్థాయిని అందుకోవడం మీ వల్ల కాదు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసే ముందు మీ బాధ్యతలను గుర్తుంచుకోండి. ప్రజల సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో మీ ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందుంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బల్మూరి వెంకట్ .. మాటలు తగ్గించి చేతల్లో చూపించండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పండి!” జోగు కిరణ్ శేర్లింగంపల్లి BRS పార్టీ నాయకులు