సాహితీ
రైతన్నకు నజరాన వాన (కవిత) -డా. బద్రి పీర్ కుమార్
కాలుష్య కోరల్లో చిక్కిన ప్రకృతి, మేఘానికి శత్రువు ఎండిన చేలు వెక్కివెక్కి ఏడ్చినా కన్నీళ్లు కనిపించవు పంటల జీవధారగ, ఎండమావుల మామూళ్లు ఆగవు అన్నం పెట్టే అన్నదాత ఆవేదన నివేదనలు మాత్రం మిగులుతాయి కరుణించిన ఆకాశమేఘ విహార సందర్శనం ఆహార శ్రమ జీవుల మనోమధన ఫలితవైనం శ్రమను నమ్ముకున్న శ్రామిక రైతుకి ఆహ్వానం అవుతుంది ప్రతి చినుకూ రైతన్నల చిరునవ్వు పై ముత్యమౌతుంది నల్లని మబ్బులు ఆకాశాన కమ్ముకోగ పచ్చదనం పరవగ నేలతల్లి పులకించగ తొలకరి చినుకులు చిందులేసి నేలను తాకగ రైతన్న ఆశయాల ఆశలు హరివిల్లుగ కనిపిస్తాయి నింగి నుండి భూమికి చేరే వర్షపు జల్లు నాగలిపట్టే రైతన్న హృదిలో ఆత్మీయ సంక్రాంతులు అన్నదాతల ఆనందానికి భూమాత చల్లని చూపులు కాగ నింగి ధరణిల మిత్రత్వం నిత్య శుభ సూచికమవుతుంది అందుకే అన్నదాత సుఖీభవ చిరునామా పైన రైతన్నకు నజరాన వాన
