Wednesday, 23 September 2026

Tag: Puvvada ajai

ఖమ్మం

డాక్టర్ జగదీష్ మరణం మమతా విద్యా సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ

ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, మమతా వైద్య విద్యా సంస్థలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. 2012లో మమతలో చేరిన జగదీష్ తక్కువ కాలంలోనే సిబ్బంది, విద్యార్థులు, రోగులు, ప్రజలకు ఆప్తుడిగా మారారని గుర్తుచేశారు. రోగుల పట్ల ఆర్తి, వైద్య వృత్తిపై అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. మమతా ఆసుపత్రిలో న్యూరోసర్జరీ విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు పేదలకు ఉచిత వైద్యసేవలు అందించడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఐఎంఏ ఖమ్మం సెక్రటరీ, ప్రెసిడెంట్‌గా వైద్య రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. జగదీష్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన విజయాలను ఎంతో సంతోషంగా పంచుకునేవాడని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.