Wednesday, 16 September 2026

Tag: Ponguleti sudhakr reddy

ఖమ్మం

స్వగ్రామంలో బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పూజలు..

కల్లూరు / ఖమ్మం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పర్యటించారు. స్వగ్రామంలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ సమేత శ్రీ సీతారామాలయంలో పూజలు చేశారు. గ్రామ యువత ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించి, కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలపై చర్చించారు. స్వగ్రామ ప్రజల ప్రేమాభిమానాలు, రైతుల ఆశీర్వాదాలు తనకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానికులు, యువత, రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.