నందలూరు హైస్కూల్ కమిటీ చైర్మన్‌గా ఈరీ శివకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక
నందలూరు హైస్కూల్ కమిటీ చైర్మన్‌గా ఈరీ శివకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు పసుపులేటి ప్రవీణ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, యూనిట్ ఇన్‌చార్జ్ మోడపోతుల రాము, కో-యూనిట్ ఇన్‌చార్జ్ ఆవుల రమేష్, గ్రామ అధ్యక్షుడు కట్టా సుబ్బన్న, నాయకుడు గంగాధర్ తదితరులు పాల్గొని ఈరీ శివకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ నందలూరు హైస్కూల్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

