Wednesday, 23 September 2026

Tag: Mala

నంద్యాల

‘హలో మాల.. చలో మార్కాపురం’ సభను జయప్రదం చేయండి: మాల సంఘాల JAC

కొలిమిగుండ్ల :రాజ్యాంగ పరిరక్షణ కోసం సెప్టెంబర్ 6న మార్కాపురంలో నిర్వహించనున్న ‘హలో మాల.. చలో మార్కాపురం’ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి పిలుపునిచ్చారు. మంగళవారం కొలిమిగుండ్లలో ఈ సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా నలుమూలల నుండి మాల మహానాడు, ఉద్యోగ, మహిళా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, జై భీమ్‌రావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, ప్రఖ్యాత గాయకుడు రేంచర్ల రాజేష్, మాల మహానాడు నాయకులు అన్నవరపు కిషోర్, పండు అశోక్ బాబు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బి. మద్దిలేటి, మారం నాగరాజు, కేశవుడు, వెంకటలక్ష్మి, శ్రీదేవి, స్వామిదాసు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.