Thursday, 17 September 2026

Tag: Library Books

అనకాపల్లి

నిరుద్యోగ యువత కోసం గ్రంథాలయాలకు పోటీ పరీక్షల పుస్తకాలు

నిరుద్యోగ యువత కోరిక మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో రూ.6 లక్షల విలువైన నూతన పోటీ పరీక్షల పుస్తకాలను కొనుగోలు చేసి జిల్లాలోని గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. బుధవారం కశింకోట శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉపయోగపడేలా పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి బుర్రీ కుమార్ రాజు, గ్రంథాలయ సిబ్బంది, గ్రంథపాలకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.