Friday, 25 September 2026

Tag: Kmc kmm

ఖమ్మం

దంసలాపురం చెరువులో గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు.. ఏర్పాట్లు ని పరిసీలించిన కలెక్టర్, సిపీ, కార్పొరేషన్ కమిషనర్..

ఖమ్మం నగరంలోని దంసలాపురం చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువులో బారికేడింగ్, గజ ఈతగాళ్లు, క్రేన్లు, బోట్లు, రక్షణ పరికరాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రాత్రి నిమజ్జనాలకు తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ఎత్తైన విగ్రహాల తరలింపునకు ప్రత్యేక రూట్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించాలని, విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.