హైదరాబాద్ బస్‌స్టేషన్‌లో గుండెపోటుతో ఖమ్మం ఆర్టీసీ డిపో కండక్టర్ మృతి..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాఠర్లపాడుకు చెందిన సామినేని లక్ష్మీనారాయణ ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం విధుల్లో భాగంగా హైదరాబాద్ బస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. లక్ష్మీనారాయణ మృతితో ఖమ్మం ఆర్టీసీ డిపో సిబ్బంది, పాఠర్లపాడు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల తోటి సిబ్బంది, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. પરિવાર సభ్యులను పరామర్శించి, లక్ష్మీనారాయణ మృతికి నివాళులర్పించారు.


