Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Iron Absorption

హెల్త్ టిప్స్

భోజనం తర్వాత టీ, కాఫీ తాగడానికి ఎందుకు విరామం ఇవ్వాలి?

భోజనం చేసిన వెంటనే వేడి వేడిగా టీ గానీ, కాఫీ గానీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు వల్ల మనం తిన్న ఆహారం నుంచి శరీరానికి అందవలసిన ఇనుము (Iron) పరిమాణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే టీ తాగినప్పుడు ఆహారంలోని ఐరన్ శోషణ 60% నుండి 80% వరకు, కాఫీ తాగినప్పుడు 30% నుండి 50% వరకు పడిపోతుంది. ఫలితంగా ఎంత మంచి పౌష్టికాహారం తిన్నా ఒంటికి రక్తం పట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ​టీలో సహజంగా ఉండే ‘టానిన్లు’, కాఫీలో ఉండే ‘క్లోరోజెనిక్ యాసిడ్’, ‘పాలీఫెనాల్స్’ ఆహారంలోని ఇనుముతో చేరి కరిగిపోని రసాయనిక బంధాలను ఏర్పరుస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి శాకాహారం నుంచి లభించే ఇనుమును (Non-Heme Iron) పేగులు గ్రహించకుండా ఇవి అడ్డుకుంటాయి. ​శరీరంలో ఇనుము లోపం ఏర్పడితే తీవ్రమైన అలసట, నీరసం, తలతిరగడం, ఏకాగ్రత లోపించడం, కాస్త నడిచినా ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపం క్రమంగా ముదిరి రక్తహీనతకు (అనీమియా) దారితీస్తుంది. ​ *తీసుకోవలసిన జాగ్రత్తలు …….* 1.​ఆహారం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగాలనుకుంటే కనీసం 45 నిమిషాల నుండి 1 గంట విరామం ఇవ్వాలి. 2.​ఇప్పటికే రక్తహీనత లేదా జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఈ వ్యవధిని 1 నుండి 2 గంటల వరకు పొడిగించడం మరింత శ్రేయస్కరం. 3.​టీ, కాఫీలను భోజనంతో కాకుండా ఉదయం 11 గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం వేళల్లో విడిగా తీసుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి. డాక్టర్ ఎం.వి. రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, నెల్లూరు.