Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*అభివృద్ధి పథంలో నరసరావుపేట**ప్రజా సంక్షేమమే శ్వాసగా డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రస్థానం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేట గడ్డపై ఇప్పుడు అభివృద్ధి కొత్త ఊపిరి పోసుకుంటోంది.
  • ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు వేస్తున్న ప్రతి అడుగు ప్రజల్లో కొత్త భరోసాను నింపుతోంది.వైద్యుడిగా వేలాది మందికి ప్రాణం పోసిన ఆయన, ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి సరికొత్త రూపురేఖలు దిద్దేందుకు నడుం బిగించారు.రోజుకు ఏకంగా…
  • "మాటలు తక్కువ – చేతలు ఎక్కువ" అన్న చందంగా ఆయన చేపడుతున్న కార్యాచరణ ఇప్పుడు పల్నాడు గడ్డపై రికార్డు స్థాయి నిధులతో స్పష్టంగా కనిపిస్తోంది.*కేవలం 40 రోజుల్లో ₹185 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం*సెప్టెంబర్ నెలలో నియోజకవర్గంలో మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి ప్రాజెక్టులు, ప్రజా అవసరాల…

నరసరావుపేట గడ్డపై ఇప్పుడు అభివృద్ధి కొత్త ఊపిరి పోసుకుంటోంది. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు వేస్తున్న ప్రతి అడుగు ప్రజల్లో కొత్త భరోసాను నింపుతోంది.వైద్యుడిగా వేలాది మందికి ప్రాణం పోసిన ఆయన, ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి సరికొత్త రూపురేఖలు దిద్దేందుకు నడుం బిగించారు.రోజుకు ఏకంగా 18 గంటల సమయాన్ని నియోజకవర్గ ప్రజల కోసమే వెచ్చిస్తూ, నిరంతరం క్షేత్రస్థాయిలోనే గడుపుతున్నారు.

“మాటలు తక్కువ – చేతలు ఎక్కువ” అన్న చందంగా ఆయన చేపడుతున్న కార్యాచరణ ఇప్పుడు పల్నాడు గడ్డపై రికార్డు స్థాయి నిధులతో స్పష్టంగా కనిపిస్తోంది.*కేవలం 40 రోజుల్లో ₹185 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం*సెప్టెంబర్ నెలలో నియోజకవర్గంలో మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి ప్రాజెక్టులు, ప్రజా అవసరాల కోసం ఏకంగా ₹90 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి.అక్టోబర్ తొలి వారంలోనే అదే ఉత్సాహంతో మరో ₹95 కోట్ల అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను పరుగులు పెట్టించారు.వెరసి,

గత రెండు నెలల వ్యవధిలోనే మొత్తం ₹185 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో నరసరావుపేట రూపురేఖలు మార్చే పనులకు పక్కా ప్రణాళిక సిద్ధమైంది.”నా నియోజకవర్గ ప్రజల కళ్లలో ఆనందం చూడటమే నా లక్ష్యం. పేట అభివృద్ధిలో ఏ ఒక్క రోజూ వృథా కాకూడదు” అనే సంకల్పంతో, సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఆయన ముందుకు సాగుతున్నారు.

పేదలకు వైద్య సేవలు అందించడం నుంచి ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పించడం వరకు ఆయన పడుతున్న శ్రమ స్థానిక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తోంది. ఈ వేగంతో నరసరావుపేట నియోజకవర్గం రాబోయే రోజుల్లో రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *