అవినీతిపై యువశక్తి
అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని లోక్ అదాలత్ జడ్జి వై.జె. పద్మశ్రీ పిలుపునిచ్చారు. కొత్తూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అంతర్జాతీయ యువజన దినోత్సవంలో ఆమె విద్యార్థులకు హక్కులు, చట్టాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మూరంరెడ్డి సుబ్బారెడ్డి, హెడ్‌మాస్టర్ మల్లికార్జున, తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ నాగేంద్ర, ఎస్‌ఐ నవీన్ కుమార్, అడ్వకేట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.


