Saturday, 5 September 2026

Tag: Happy టీచర్స్ day

తిరుపతి

*తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం,దొరవారిసత్రం మండలంలో MAMLA ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు*

*దొరవారిసత్రం, సెప్టెంబర్ 5 (పున్నమి న్యూస్):* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని MAMLA ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల ఆవరణను త్రివర్ణ పతాకాలతో అందంగా అలంకరించారు. చిన్నారులంతా రంగురంగుల దుస్తులలో ముస్తాబై ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాళ్లు మాట్లాడుతూ, “గురువు అంటే కేవలం చదువు చెప్పే వ్యక్తి కాదు, జీవితానికి దారి చూపే దేవుడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో కీలకం” అని అన్నారు. పిల్లలు కూడా తమ గురువులకు పూలు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ లతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.