గంగుల సెటైర్లు.. ‘మైనింగ్ అంటే మై ఎర్నింగ్!’
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కోసం సొంత డబ్బు ఖర్చు చేశానని, ఇప్పుడు సంపాదించుకోవాలని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. కమిషన్లు, సెటిల్‌మెంట్లు, భూ భారతి, వెలుగుమట్ల అంశాలను ప్రస్తావిస్తూ “మైనింగ్ అంటే మై ఎర్నింగ్ అధ్యక్షా!” అంటూ చేసిన వ్యాఖ్యలు మాక్ అసెంబ్లీలో ఆకట్టుకున్నాయి.


