ఫ్లోరిడా ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం రాహుల్ మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వారి కుటుంబాలకు సమాచారం అందింది.

