Wednesday, 23 September 2026

Tag: East Godavari

తూర్పు గోదావరి

పోలవరం జిల్లా అడ్డతీగలలొ వాహనాలు తనిఖీ

అడ్డతీగలలో పోలీసులు వాహనాలు తనిఖీ.. అడ్డతీగల , ఆగస్టు 23;పున్నమి రిపోటర్ వాసు ఆదివారం రాత్రి 8 గంటలకు అడ్డతీగల సీతపల్లి జంక్షన్ లో అడ్డతీగల ఎస్సై బి .వినోద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాహన పత్రాలను పరిశీలించారు. వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను వాహనంలో ఉంచాలని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్సై వాహనదారులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అలా జరిగిన ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్ఐ వినోద్ తెలిపారు.

తూర్పు గోదావరి

ప్రపంచ దోమాల దినోత్సవం ఎల్లవరం

పోలవరం జిల్లా. పున్నమి రిపోర్టార్ వాసు ది 20-08-2026 న ప్రపంచ దోమల దినోత్సవం ఎల్లవరం మరియు దుప్పులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారుల సమక్షంలో ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ లో దోమ పుట్టరాదు –దోమ కుట్టరాదు చిన్న దోమ -పెద్ద ముప్పు అనే నినాదాల తో ర్యాలీ మరియు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత, నీటి నిల్వలు లేకుండా ప్రతి వారం ఫ్రైడే డ్రై డే పాటించాలని తెలియజేస్తూ, దోమల వలన మలేరియా డెంగు, చికెన్ గుణ్యా, బోధకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు సంబవించుని ప్రజలకు తెలియజేసియున్నాము ఈ కార్యక్రమం నకు Dr దివ్య PHC దుప్పులపాలెం, Dr దేవి ప్రియాంక PHC ఎల్లవరం, SUO కు. లక్ష్మణరావు,MTS P. శ్రీనివాసరావు, మరియు వైద్య సిబ్బంది, ఆశ లు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందరేశ్వరి నియామకం

బిక్కవోలు, ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారికి ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు శ్రీ పల్లి శ్రీనివాసరెడ్డి (వాసు) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. పురందరేశ్వరి గారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజాసేవలో ఆమె మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే బిక్కవోలు గ్రామానికి చెందిన కూటమి (ఎన్‌డీఏ) నాయకులు, కార్యకర్తలు కూడా శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని వారు ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

మాదకద్రవ్యాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి: మాదకద్రవ్యాలు, వ్యసనాల నియంత్రణపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసైన యువత వాటి నుంచి బయటపడలేక చెడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ అందించి వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలని కోరారు. యువతను సన్మార్గంలో నడిపించడంలో కుటుంబాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇటీవల గొల్లల మామిడాడలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో అక్కడ త్వరలోనే మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం (Awareness Camp) ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రామేశ్వరం, ఏపీత్రాయం తదితర శివారు గ్రామాల్లో పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో, ముఖ్యంగా 2019–2024 మధ్యకాలంలో, గంజాయి సాగు, విక్రయాలకు ప్రోత్సాహం లభించడం వల్ల మాదకద్రవ్యాల ప్రభావం పెరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. దీని ప్రభావంతో యువత తప్పుదారి పట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. Uploaded Video:

తూర్పు గోదావరి

నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్ హాల్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ఐఏఎస్ గారి కుమారుడి నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాణ్యం నియోజకవర్గ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, సనాతని దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువు ప్రత్యూష, వరుడు భరత్‌లను వారు ఆశీర్వదించి, వారి నూతన జీవితం సుఖసంతోషాలతో, విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

బిక్కవోలు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బిక్కవోలులో ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు వాజ్‌పేయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు.

తూర్పు గోదావరి

మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన మండపేట ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్

కేశవరం, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): మెగాస్టార్ చిరంజీవి జన్మదిన మహోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో ఉండమట్ల రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో మండపేట మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఉండమట్ల శ్రీనివాస్ రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్‌ను శిబిర నిర్వాహకులు ఉండమట్ల రామ్ అభినందించి, అభినందన సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీఓ (కేశవరం) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పిఎస్‌వీ), పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబుతో పాటు సంస్థ సభ్యులు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్‌ను అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం సామాజిక సేవకు చక్కటి ఉదాహరణగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

బిక్కవోలులో శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ‘పందిరి రాట మంచి’

బిక్కవోలు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బిక్కవోలు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో నిర్వహించిన ‘పందిరి రాట మంచి’ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మోక్షితకు ఎంపీ, ఎమ్మెల్యేల అభినందనలు

రాజమహేంద్రవరంలో నిర్వహించిన “CICSE రీజినల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్–2026” అండర్–17 విభాగంలోని 3000 మీటర్ల రన్నింగ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని రాయుడు మోక్షితను రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మోక్షితను అభినందిస్తూ, క్రీడల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తూర్పు గోదావరి

స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తి — మహిళల ఆరోగ్యం, భద్రతపై అవగాహనకు ప్రాధాన్యం

రంగంపేట, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా రంగంపేట మండలం నల్లమిల్లిలోని అన్నపూర్ణ గార్డెన్స్‌లో మహిళలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, కూటమి మహిళా నాయకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ సంక్షేమంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఆరోగ్య అంశాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.   మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందస్తు పరీక్షలు, వ్యాధి నివారణ చర్యలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని కోరారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను తొలగించి అర్హులైన వారికి వైద్యుల సూచనల మేరకు టీకా ప్రయోజనాలను వివరించాలని సూచించారు.   యువతలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళలు కుటుంబాల్లో ఆరోగ్యం, విద్య, వ్యసనాల నివారణపై కీలక పాత్ర పోషించాలని తెలిపారు.   మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. నేరాలపై చట్టపరమైన చర్యలతో పాటు బాధితులకు సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని, స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.   ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ సౌలభ్యం పెరిగి కుటుంబ సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. అనపర్తి 100 పడకల ఆసుపత్రి, పెదపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సూర్యకుమారి అధ్యక్షత వహించగా, కూటమి నాయకులు, మహిళా శక్తి ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.