వార్త ముఖ్యాంశాలు
- పామూరు మేజర్ పంచాయతీ నామినేషన్ల ఘట్టం మొదలవుతున్న సందర్బంగా, వార్డు మెంబర్ల ప్రచార పర్వం ఊపందుకొని, పట్టణ వాతావరణం వేడెక్కిన విషయం పామూరు పంచాయతీ పరిధిలోనే కాక, మండల స్థాయిలోని ప్రజలందరికి తెలిసిన విషయం..
- ఈ పామూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల గెలుపు గుర్రాలను ఎలా నిర్ణయించాలో, ఎవరికి ఏ ఏ వార్డులలో స్థానం కల్పించి, గెలిపించాలో అర్ధం కాక వారం రోజులు ఇరు పార్టీల అధినాయకులు నిద్రలేని రాత్రులు గడిపారు..
- ఈ పంచాయతీ వార్డుల అన్వేషణలో భాగంగా 14 వ వార్డు మెంబర్గా, అందరికి సుపరిచితుడు, ప్రముఖ మహారాష్ట్ర వ్యాపారి అయిన షేక్.
పామూరు మేజర్ పంచాయతీ నామినేషన్ల ఘట్టం మొదలవుతున్న సందర్బంగా, వార్డు మెంబర్ల ప్రచార పర్వం ఊపందుకొని, పట్టణ వాతావరణం వేడెక్కిన విషయం పామూరు పంచాయతీ పరిధిలోనే కాక, మండల స్థాయిలోని ప్రజలందరికి తెలిసిన విషయం.. ఈ పామూరు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల గెలుపు గుర్రాలను ఎలా నిర్ణయించాలో, ఎవరికి ఏ ఏ వార్డులలో స్థానం కల్పించి, గెలిపించాలో అర్ధం కాక వారం రోజులు ఇరు పార్టీల అధినాయకులు నిద్రలేని రాత్రులు గడిపారు.. ఈ పంచాయతీ వార్డుల అన్వేషణలో భాగంగా 14 వ వార్డు మెంబర్గా, అందరికి సుపరిచితుడు, ప్రముఖ మహారాష్ట్ర వ్యాపారి అయిన షేక్. పిల్లఖాసీం గారి రఫీ (నాన ) పేరు వై. యస్. ఆర్. పార్టీ నాయకులు బలపరచి ఖరారు చేశారు.. షేక్. పిల్లఖాసీం గారి రఫీ మాట్లాడుతూ, వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నామీద ఎంతో నమ్మకముంచి ఈ బాధ్యత అప్పగించారని, ఎలాగైనా 14 వ వార్డు మెంబర్గా గెలిచి, పంచాయతీ ఎన్నికల వార్డుల పోరులో 14 వ వార్డు మొదటి గెలుపుగా నమోదు చేస్తానని పత్రిక విలేకరుల చర్చగోష్టిలో వివరించారు..