Thursday, 1 October 2026

Tag: Dyfi

నంద్యాల

వైయస్సార్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఉన్న ట్రాన్స్ఫారంను అక్కడి నుండి తొలగించి వేరేచోట ఏర్పాటు చేయండి : DYFI

నంద్యాల పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ నగర్ లో బుడగ జంగాల కాలనీ వద్ద ఉన్నటువంటి ట్రాన్స్ఫారంను అక్కడి నుండి తీసి వేరే చోట ఏర్పాటు చేయాలని ఏరియా ప్రజలతో డివైఎఫ్ఐ నాయకులు కలిసి ట్రాన్స్ఫారం చూపిస్తూ నిరసన చేయడం జరిగింది.వైయస్సార్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఉన్న ట్రాన్స్ఫారం వలన అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాలకు గురవుతున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది మేడం గారు స్పందించి అక్కడి నుండి ఆ ట్రాన్స్ఫర్ ని తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పడం కూడా జరిగింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో ఆ ట్రాన్స్ఫారం వలన ఒక మహిళ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం కూడా జరిగింది. అదే విధంగా ఒక యువకునికి షాక్ కొట్టడం వలన తీవ్రమైన దెబ్బలు తగలడం నెల రోజులు మంచం పైనే ఉండడం కూడా అక్కడ జరిగింది. ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీగా వారిని ప్రశ్నిస్తున్నామని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ అన్నారు. అక్కడి ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు అడుగుతే దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేసి మేము పైకి పంపించాము అని చెబితే అక్కడున్న నాయకులు వెళ్లి ఇది సార్ పరిస్థితి అని అడిగితే ట్రాన్స్ఫారానికి ఎస్టిమేషన్ వేసాము. కానీ ఆ డబ్బులు ఎవరు కడతారు మీరు కడతారా అంటూ వారిని అడగడంతో వారు అక్కడి ప్రజలు అయోమయంలో ఉన్నారు. దాన్ని తరలించడానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. దాన్ని మీరు బరాయిస్తారా మీరు పెట్టుకుంటారా అని అక్కడి ప్రజలను విద్యుత్ శాఖ అధికారులు అడుగుతున్నారు. అదే విధంగానే జిల్లా కలెక్టర్ చెప్పారు కదా మీరు ఎందుకు చేయడం లేదు అంటే వారు చాలా చెబుతారు కానీ దానికి డబ్బులు మేము పెట్టుకోలేము అని ఈరోజు వారు అంటున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులను డివైఎఫ్ఐ గా మేము అడుగుతున్నాము మీరు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారా లేక ప్రజల సొమ్మును దోచుకోవడానికి ఉన్నారా అంటూ డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ మండిపడ్డారు. తక్షణమే అక్కడున్న ట్రాన్స్ఫార్మానికి తొలగించి వేరేచోట ఏర్పాటు చేయాలని చేరును ఎడల ప్రత్యక్ష ఆందోళనకు చేపడుతామని అవసరమైతే కరెంట్ ఆఫీస్ ఎదుట దీక్షలు కూర్చోవడం కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా వారిని హెచ్చరించడం జరుగుతుందని శివ తెలిపారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ సహాయ కార్యదర్శి సాయి, ఉపాధ్యక్షులు రాఘవ,శ్రీనివాసులు, డివైఎఫ్ఐ నాయకులురవి,శ్రీను,కుల్లాయప్ప,పెద్ద రమణ,శివ, వార్డు ప్రజలు వెంకటేశ్వర్లు,చిన్న జమ్మక్క,పెద్ద జమ్మక్క,శ్రావణి, విజయలక్ష్మి,వెంకటలక్ష్మి,రవణమ్మ, తదితరులు పాల్గొనడం జరిగింది.

నంద్యాల

డివైఎఫ్ఐ నూతన టౌన్ కమిటీ ఎన్నిక

నంద్యాల డివైఎఫ్ఐ (DYFI) పట్టణ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా G.దుర్గా, కార్యదర్శిగా S.శివతో పాటు 25 మందితో కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు భృతి చెల్లించాలని, పూర్తిస్థాయి పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో విద్యా, వైద్య రరంగాల్లో దోపిడీపై, స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.