Thursday, 24 September 2026

Tag: Distic fair safty officer

ఖమ్మం

ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని హాస్టళ్లపై చర్యలు తప్పవు:జిల్లా ఫైర్ &సేఫ్టీ అధికారి వెల్లడి

ఖమ్మం నగరంలో సరైన వసతులు, అగ్నిమాపక భద్రతా చర్యలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టళ్లపై చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి హెచ్చరించారు. ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో పాటు, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న హాస్టళ్లలోనూ అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శనివారం పున్నమి ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ తో చరవాణి ద్వారా మాట్లాడిన జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సరైన మార్గాలు, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్‌ భద్రత వంటి అంశాలను నిర్ధారించుకోవాలని కోరారు. నిబంధనలు పాటించకుండా హాస్టళ్లను నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని హాస్టళ్లను నిర్వహించాలని ఆయన సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.