Sunday, 27 September 2026

Tag: Cp khammam

ఖమ్మం

2,700 గణేష్ విగ్రహాల నిమజ్జనం.. 1,200 మందితో పటిష్ట బందోబస్తు

గణేష్ నవ రాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 2,700 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సుమారు 1,200 మంది పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు పోలీసుల సూచనలు,:- ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలని, ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లకు సహకరించాలని కమిషనర్ సూచించారు. ఊరేగింపుల్లో అధిక వేగం, ప్రమాదకర విన్యాసాలు, భారీ శబ్దాలు, డీజేలకు దూరంగా ఉండాలని కోరారు. వాహనాలపై పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించరాదన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చెరువులు, నీటి వనరుల వద్ద బారికేడ్లు దాటి నీటిలోకి వెళ్లరాదని, విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.