Thursday, 17 September 2026

Tag: #Bhanothchandravathi

ఖమ్మం

గిరిజన హక్కులకు కేసీఆర్‌ భరోసా.. 10 శాతం ఎస్టీ రిజర్వేషన్‌ అమలు చేసిన కేసీఆర్ చిత్ర పటానికి పాలభిషేకం

తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి అమలు చేసిన కేసీఆర్‌ నిర్ణయాన్ని స్మరించుకుంటూ ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైరా మాజీ ఎమ్మెల్యే డా. బానోత్ చంద్రావతి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి స్వయం పాలన, రాజకీయ ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. గిరిజన విద్య, గురుకులాల విస్తరణ, తండాల అభివృద్ధి, పోడు భూముల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అమర్‌సింగ్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థి నాయకులు, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. సాధించిన హక్కులను కాపాడేందుకు, పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని చంద్రావతి స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.