Tuesday, 29 September 2026

Tag: Bhaakti

తూర్పు గోదావరి

దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం, బేలూరు మఠాన్ని సందర్శించిన ఎంపీ పురంధేశ్వరి

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం:కోల్‌కతాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని సోమవారం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. శ్రీ రామకృష్ణ పరమహంసులు కాళీమాతను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక సాధన చేసిన పవిత్ర క్షేత్రంగా దక్షిణేశ్వర్‌కు విశిష్ట స్థానం ఉందని ఆమె పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించినట్లు తెలిపారు. అనంతరం హౌరాలోని బేలూరు మఠాన్ని ఆమె సందర్శించారు. స్వామి వివేకానందుల స్ఫూర్తితో రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ ఆధ్యాత్మికతతో పాటు మానవ సేవను కొనసాగిస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని పురంధేశ్వరి పేర్కొన్నారు. బేలూరు మఠం ప్రశాంత వాతావరణం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.