Thursday, 10 September 2026

Tag: Best teacher award

సిద్ధిపేట

నక్క అనిత గారికి లయన్స్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలుగా అవార్డు

పున్నమి ప్రతినిధి బోధన్.. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ నామినేట్ చేసిన నక్క అనిత గారికి లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక రవీంద్ర భారతి వేదికగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో 08/09/2026 మంగళవారం రోజున నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాంపూర్ MPPS పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ అధ్యాపకురాలు శ్రీమతి నక్క అనిత గారిని ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి అభ్యున్నతికి అంకితభావంతో సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ నామినేట్ చేసిన నక్క అనిత గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ Ln. బాబురావు గారు, Ln. సూర్యరాజు గారు, లయన్ బసవేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ విజయలక్ష్మి గారు తదితర లయన్స్ క్లబ్ ప్రముఖులు హాజరై నక్క అనిత గారిని అభినందించారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అధ్యాపకులను గుర్తించి సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తమ అధ్యాపకురాలిగా లభించిన ఈ గౌరవం రాంపూర్ MPPS పాఠశాలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బోధన్ అయ్యప్ప సేవ అధ్యక్షుడు లయన్ కుమ్మరి పోశెట్టి గారు, కార్యదర్శి లయన్ గుడిపల్లి గంగారెడ్డి గారు, కోశాధికారి లయన్ సుర బత్తుని శ్రీనివాసరావు గారు హాజరై అభినందనలు తెలియజేశారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.