నంద్యాలలో ఘనంగా ‘శిల్పా మహిళా సహకార బ్యాంక్’ నూతన కార్యాలయం ప్రారంభం
నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లో ‘శిల్పా మహిళా సహకార బ్యాంక్’ నూతన కార్యాలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, బ్యాంక్ చైర్‌పర్సన్ నాగిని రవిసింగారెడ్డి వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత 16 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా బ్యాంక్ నిరంతర సేవలు అందిస్తోందన్నారు. మహిళల నమ్మకాన్ని గెలుచుకుంటూ, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి ద్వారా వారు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంక్ ఎల్లప్పుడూ తోడ్పడుతుందని తెలిపారు. నూతన కార్యాలయం ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సిబ్బంది, మాజీ మహిళా మున్సిపల్ కౌన్సిలర్లు, ఖాతాదారులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


