Tuesday, 8 September 2026

Tag: B R S పై కాంగ్రెస్ నిరసన

రాజన్న సిరిసిల్ల

దళిత స్పీకర్ పై అహంకారపూరిత వాక్యాలు తాత మధు పై కఠిన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్

దళిత స్పీకర్‌పై అహంకార వ్యాఖ్యలు.. తాతా మధుపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధి ) దళిత సామాజిక వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత, అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్తాబాద్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. తాతా మధుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, దళిత స్పీకర్‌కు జరిగిన అవమానంపై బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఎళ్ల బాల్రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.