Monday, 21 September 2026

Tag: హైదరాబాద్

రంగారెడ్డి

ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు.. 2,500 మందికి అన్నదానం.. లడ్డూ వేలం, నిమజ్జన కార్యక్రమాలు

ఉప్పల్: పీర్తాజిగూడలోని ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఉప్పల్ ఫిర్దోజిగూడా ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లుగా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడో రోజున 2 వేల నుంచి 2,500 మందికి అన్నదానం, ఐదో రోజున స్వామివారి లడ్డూ వేలం పాటతో పాటు నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఆసుపత్రిలో బహుళ వైద్య విభాగాలు, అన్ని రకాల శస్త్రచికిత్సలు, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. రోగులకు 30 నుంచి 50 శాతం వరకు రాయితీ, వైద్య పరీక్షల కేంద్రం, మందుల దుకాణం, 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహణ సంచాలకులు భరత్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, మహేష్, అరవింద్, సురేష్, విగ్నేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సేవలను సీఎం ప్రశంసించారు. మూసీ పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పునరుద్ధరణకు సహకారం కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. 30 వేల ఎకరాల్లో నెట్-జీరో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రంగారెడ్డి

ఉప్పల్ శిల్పారామంలో ఘనంగా ఆత్మీయుల సమ్మేళనం

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్, ఉప్పల్ శిల్పారామంలో TVG సేన ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, ఆత్మీయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తూళ్ల దేవేందర్ గౌడ్, ఆయన కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అవిరేను రామ్మోహన్, BJHPS సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు వారిని ఆత్మీయంగా కలిశారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మీ దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్, కోడేరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

రంగారెడ్డి

ఘనంగా శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్ ప్రారంభోత్సవం

పున్నమి: చాంద్రాయణగుట్ట: బండ్లగూడ, దుర్గానగర్, లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలాపూర్ మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన శాకాహార వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, బాలాపూర్ కార్పొరేటర్ ప్రభాకర్‌రెడ్డి, శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్ యజమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్లో టిఫిన్స్, మీల్స్, సౌత్ ఇండియన్, చైనీస్ తదితర శాకాహార వంటకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

రంగారెడ్డి

టీకేఆర్ కమాన్ రోడ్‌లో కేకేఆర్ గ్రీన్ మోటార్స్ నూతన ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: టీకేఆర్ కమాన్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కేకేఆర్ గ్రీన్ మోటార్స్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం రోజున ఘనంగా జరిగింది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నూతన షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జె.ఎస్.ఆర్. డైనమో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫౌండర్ పాశం జనార్దన్ రెడ్డి, కేకేఆర్ గ్రీన్ మోటార్స్ సీఓ కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ లక్ష్మీ మోటార్స్ ఎండీ కిరణ్ మహేశ్వరి రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో అవసరమని, ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. “సొల్యూషన్ టు పొల్యూషన్” అనే నినాదంతో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు కేకేఆర్ గ్రీన్ మోటార్స్ కృషి చేస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

రంగారెడ్డి

ఎమ్మెల్సీ కోదండరాంకు బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్ జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి: హైదరాబాద్, సెప్టెంబర్ 5: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు తార్నాకలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు మంగళిపాటి సుమన్, ప్రధాన కార్యదర్శి అంజద్ అలీ ఖాన్, కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుడు మెతుకు ఉప్పలయ్య, సంయుక్త కార్యదర్శి రౌతు నరసింహ, సభ్యులు గౌలికార్ మహేష్ కుమార్, వేముల అఖిల్ తదితరులు కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోదండరాంను శాలువాతో సత్కరించి, ఆయనకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు, తెలంగాణ జన సమితి కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

న్యాయవాద కమిషనర్లకు ఆచరణాత్మక మార్గదర్శిని… యువ న్యాయవాదులకు పుస్తకం ఎంతో ఉపయోగకరం: హైకోర్టు న్యాయమూర్తులు

పున్నమి: రంగారెడ్డి జిల్లా: న్యాయవాది జి. అనిల్ కిరణ్ కుమార్ రచించిన “న్యాయవాద కమిషనర్లకు ఆచరణాత్మక మార్గదర్శిని” పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు వాకిటి రామకృష్ణారెడ్డి, జి.ఎం. మొహియుద్దీన్, మద్రాసు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి కె. సురేందర్, కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ అదనపు డీజీపీ, మాజీ సీబీఐ సంయుక్త సంచాలకులు వి. లక్ష్మీనారాయణ, తెలంగాణ న్యాయవాద మండలి అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, న్యాయవాద కమిషనర్ల పాత్ర న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. న్యాయవాద కమిషనర్ల విధులు, బాధ్యతలు, ఆచరణాత్మక అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించే ఈ పుస్తకం ముఖ్యంగా యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో న్యాయపరమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని పేర్కొంటూ రచయిత జి. అనిల్ కిరణ్ కుమార్‌ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ప్రముఖులు, న్యాయవాద కమిషనర్లు, న్యాయ రంగానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియామకం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: బ్రహ్మాండ్ సనాతన సంఘ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియమితులయ్యారు. బుధవారం రోజున బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షులు శివ చేతుల మీదుగా పడాల సౌజన్య లత నియామక పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పడాల సౌజన్య లత మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని గౌరవిస్తూ వాటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి భక్తి కార్యక్రమాలను నిర్వహించి, ప్రతి ఒక్కరికీ హిందూ మతం, సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు చేపడతానన్నారు. అలాగే నోములు, వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. బ్రహ్మాండ్ సనాతన సంఘ్ అధ్యక్షులు శివ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, ఐకమత్యంతో కలిసి జీవించాలని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మంలో జీవన క్రమశిక్షణతో పాటు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి ఒక్కరినీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువత ముందుకు వచ్చి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శివ అన్నారు.

రంగారెడ్డి

మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

52 కోట్ల వ్య‌యంతో 400 మీట‌ర్ల పొడ‌వైన బ్రిడ్జి నిర్మాణం.. మూసీలో ల‌క్షా యాభై వేల క్యూసెక్కుల వ‌రద వ‌చ్చినా ఇబ్బంది త‌లెత్త‌కుండా బ్రిడ్జి నిర్మాణం. మెరుగు కానున్న అంబ‌ర్ పేట‌, మూసారాంబాగ్ కనెక్టివిటీ.. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వి హ‌నుమంత‌రావు,ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబ‌ర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గ‌ణేష్ , జూబ్లీహిల్స్ ఎంఎల్ ఏ నవీన్ యాదవ్ , ఎంఎల్ ఏ మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ,ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

క్రీడా స్ఫూర్తితో కళకళలాడిన పల్లవి ఇంజినీరింగ్ కళాశాల, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్‌లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందించే లక్ష్యంతో వివిధ ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ మల్క కొమరయ్య వర్చువల్‌గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మల్క నవీన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక, సాంస్కృతిక, సహపాఠ్య కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అకాడమిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎస్.జి.ఎస్. మూర్తి క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, ఏకాగ్రత, సమయపాలన పెంపొందుతాయని తెలిపారు. మేనేజ్‌మెంట్ రిప్రజెంటేటివ్ శ్రీ బెరెల్లి కమలాకర్ రావు, ప్రిన్సిపాల్ డా. జె.బి.వి. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆర్. ప్రశాంత్ కుమార్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల సమన్వయంలో ధనుంజయ రావు కొడాలి, శ్రీ ఎ. సంతోష్, గురునాథం, సి.హెచ్. రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.