Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: ప్రభుత్వ పథకాలు తెలంగాణ జనగామ జిల్లా

జనగాం

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జఫర్‌గఢ్, నవంబర్ 16: అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం జఫర్‌గఢ్ ఎంపీడీవో కార్యాలయంలో 717 మందికి కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, రూ.51.98 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 4.63 లక్షల పింఛన్ల కోసం ఏటా రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నెల 19న ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,800 కోట్ల నిధులు తెచ్చామని శ్రీహరి వెల్లడించారు.