ఫార్మర్ ఐడీ లేకుంటే పథకాలకు ఆటంకం
ప్రతి రైతు తప్పనిసరిగా 11 అంకెల ఫార్మర్ ఐడీ పొందాలని గుంటూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్. మోహన్రావు సూచించారు. పెదకాకాని మండలం ఉప్పలపాడులో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఆధార్లాగే రైతులకు ఫార్మర్ ఐడీ కీలకమని, భవిష్యత్తులో ధాన్యం కొనుగోలు, పీఎం కిసాన్ వంటి వ్యవసాయ సేవలు దీనితో అనుసంధానమయ్యే అవకాశం ఉందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఐడీ పొందాలని కోరారు. ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగం, వరి తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. ఈ-క్రాప్ నమోదు 95 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు.


