Thursday, 1 October 2026

Tag: తెలంగాణా

నిజామాబాద్

భారీగా పెరిగిన ఉల్లి ధరలు.. కేంద్రం కీలక చర్యలు దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి,

దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.50 దాటడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. చక్కెర కేజీ రూ.70 దాటింది. తాజాగా ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. దీంతో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ధరలు పెరగడంతో మహారాష్ట్ర (Maharashtra) నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి నగరాలకు రైలు మార్గం ద్వారా ఉల్లిపాయలను రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. టోకు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, మహారాష్ట్రలోని తన బఫర్ నిల్వల (అదనపు నిల్వల) నుండి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయలను తరలించేందుకు సోమవారం నుంచి “కాందా ఎక్స్‌ప్రెస్” (Kanda Express)ను ప్రారంభించింది. Onion Prices | సరఫరా పెంచడంతో.. జాతీయ సగటు కంటే ధరలు ఎక్కువగా ఉన్న ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి నగరాలకు నాసిక్ నుండి ఈ ప్రత్యేక రైలు ద్వారా ఉల్లిపాయలను రవాణా చేస్తారు. అధిక ధరలు ఉన్న మార్కెట్లలో సరఫరాను పెంచడం, వంటగదిలో అత్యవసరమైన ఈ సరుకు ధరలు మరింత పెరగకుండా నిరోధించడం లక్ష్యమని కేంద్రం తెలిపింది. శనివారం నాటికి ఉల్లిపాయల సగటు చిల్లర ధర కిలోకు సుమారు రూ. 42కి చేరింది. ఢిల్లీలో ఏడాది క్రితం ఉల్లి ధర కిలో రూ.35 ఉండగా.. తాజాగా రూ. 65కి చేరింది. అధిక ధరలు ఉన్న ప్రాంతాలకు బఫర్ నిల్వల నుంచి రైలు ద్వారా ఉల్లిపాయలను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. Onion Prices | ఉత్పత్తి తగ్గడంతో.. దేశంలోనే అత్యధికంగా ఉల్లిపాయలను ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో, సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాలు ఆలస్యం కావడంతో ఉల్లిపాయల ఉత్పత్తిలో 5-7 శాతం తగ్గుదల నమోదైనట్లు సమాచారం. దీంతో కేంద్రం బఫర్​ స్టాక్​ నుంచి ఉల్లిపాయలను పలు రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది.

నిజామాబాద్

బిజెపి అధ్యక్షుడు రామ్ చందర్రావు నిరాహార దీక్ష

₹15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టి 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న రేవంత్ సర్కార్ పై బిజెపి పోరుబాట “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి”.. కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేలా… తెలంగాణ బిజెపి అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారి 2 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది…

నిజామాబాద్

WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? ఈ ట్రిక్‌లో నిజమెంత?

రౌటర్‌పై నాణెం పెడితే వైఫై సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిట్కాకు శాస్త్రీయ ఆధారం లేదు. నాణెం యాంటెనా లాగా పనిచేస్తుందనే వాదనకు ఆధారాలు లేవు. పైగా రౌటర్ వెంటిలేషన్‌కు అడ్డంకి కలిగితే వేడెక్కే ప్రమాదం ఉంది. సరైన ప్రదేశంలో రౌటర్ ఉంచడమే ఉత్తమ మార్గం. WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? ఈ ట్రిక్‌లో నిజమెంత? ఇంట్లో వైఫై సిగ్నల్ తక్కువగా ఉందా? అయితే రూటర్‌పై ఒక నాణెం పెడితే సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. నాణెంలోని లోహం యాంటెనా లాగా పనిచేసి వైఫై సిగ్నల్‌ను మెరుగుపరుస్తుందని కొందరు చెబుతున్నారు. మరి అందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నాణెం పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? రౌటర్‌పై నాణెం పెట్టడం వల్ల వైఫై వేగం పెరుగుతుందని చెప్పడం సరైంది కాదు. సాధారణంగా వైఫై రూటర్లు 2.4GHz, 5GHz వంటి ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తాయి. ఒక సాధారణ కాయిన్ రూటర్‌పై ఉంచడం వల్ల ఈ సిగ్నల్ శక్తి లేదా ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరుగుతుందని చెప్పడానికి ఆధారం లేదు. నెట్‌వర్క్ వేగం అనేది ఇంటర్నెట్ ప్లాన్, రూటర్ సామర్థ్యం, దూరం, గోడలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల జోక్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. నాణెం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రూటర్‌ బరువు తక్కువగా ఉండి టేబుల్‌పై కదులుతున్నట్లయితే దాన్ని స్థిరంగా ఉంచడానికి నాణెం ఉపయోగపడవచ్చు. కానీ దీనికి వైఫై సిగ్నల్ పెరగడానికి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా రౌటర్‌పై లోహ వస్తువులను ఉంచడం ద్వారా యాంటెనా పనితీరు మెరుగుపడుతుందని భావించడం తప్పు. రూటర్‌పై వస్తువులు పెట్టడం ఎందుకు మంచిది కాదు? రూటర్ పనిచేసే సమయంలో కొంత వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడి బయటకు వెళ్లేందుకు రూటర్‌లో వెంటిలేషన్ రంధ్రాలు ఉంటాయి. వాటిపై నాణేలు లేదా ఇతర వస్తువులు ఉంచితే గాలి ప్రసరణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల రూటర్ వేడెక్కడం, పనితీరు తగ్గడం లేదా దీర్ఘకాలంలో పరికరానికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. రూటర్‌ను ఎక్కడ ఉంచాలి? మెరుగైన వైఫై కోసం రౌటర్‌ను ఇంటి మధ్యభాగానికి దగ్గరగా, కొంత ఎత్తులో, చుట్టూ ఖాళీ స్థలం ఉండేలా ఉంచడం మంచిది. పెద్ద లోహ వస్తువులు, మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మూసివున్న క్యాబినెట్లు, అధిక వేడి ఉండే ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. వంటగది లేదా కిటికీ దగ్గర ఉంచడం కంటే ఇంటిలోని ఇతర ప్రాంతాలకు సిగ్నల్ సమానంగా చేరే ప్రదేశాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

నిజామాబాద్

పద్మశాలి సంఘం వద్ద మువ్వలనే జెండా

నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో 80 వ స్వాతంత్ర దినోత్సవం మువ్వలన జెండా పద్మశాలి సంఘం అధ్యక్షులు అయినటువంటి గోనె కృష్ణ ఎగరవేశారు, సంఘం బాడీ సభ్యులు కలిసి తీవర్న పథకాన్ని ఎగరవేశా, చిన్నారులకు మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు….

నిజామాబాద్

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

ఈ పండుగ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో నూతన ఉత్సాహం, చైతన్యం నింపి అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని అభిలషించారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందిస్తూ అసమానతలు లేని శాంతి, సౌభ్రాతృత్వాలతో బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభసందర్భంగా నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.