Wednesday, 9 September 2026

Tag: #డిపాజిట్‌బీమా #విజయసాయిరెడ్డి #DICGC #RBI #BankDeposits #NirmalaSitharaman #PunnamiNews

ఆంధ్రప్రదేశ్

డిపాజిట్ బీమా రూ.10 లక్షలకు పెంచాలి:విజయసాయి రెడ్డి

బ్యాంకు విఫలమైతే డిపాజిటర్‌కు ప్రస్తుతం డీఐసీజీసీ ద్వారా అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే బీమా రక్షణ లభిస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా కష్టపడి పొదుపు చేసిన కుటుంబాలకు ఈ పరిమితి సరిపోదన్నారు. కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐని కోరారు. ప్రజల పొదుపులకు మరింత భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.